ఈ ఫొటోలోని హీరోని గుర్తుపట్టండి.. | 'Photobomb classic' tweets Rana | Sakshi
Sakshi News home page

ఈ ఫొటోలోని హీరోని గుర్తుపట్టండి..

Mar 14 2016 6:25 PM | Updated on Aug 11 2019 12:52 PM

పై ఫొటోలో ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో నక్కిన హీరో ఎవరో గుర్తుపట్టారా. చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ గతవారం విభిన్న కార్యక్రమానికి వేదికైంది.

పై ఫొటోలో ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో నక్కిన హీరో ఎవరో గుర్తుపట్టారా. చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్ గతవారం విభిన్న కార్యక్రమానికి వేదికైంది. నవాబుల కాలం నుంచి పసందైన విందుకు వేదికైన ఆ టేబుల్ చుట్టూ ప్రముఖ మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. సుస్మితాసేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ షోలో పలువురు టాలీవుడ్ నటులు మెరిశారు. ఆ సందర్భంగా తీసుకున్న సెల్ఫీలను ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు.

కాగా ప్రగ్యా జైస్వాల్, సోనాల్ చౌహాన్లు కలిసి దిగిన ఓ సెల్ఫీ.. ఫొటోబాంబ్ (అనుకోకుండా ఒక ఫొటోలో వేరేవాళ్లు రావడం) అయ్యింది. ఫొటోబాంబ్ క్లాసిక్ అంటూ క్యాప్షన్ కూడా జోడించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆ హీరో. ఇంతకీ అతగాడిని గుర్తుపట్టినట్టేనా.. అతడే.. మన టాలీవుడ్ కండలవీరుడు రానా!  ఈ ఫొటోకి అభిమానుల నుంచి భలే భలే కామెంట్లు వస్తున్నాయి. కాగా సామాజిక సంస్థ 'టీచ్ ఫర్ చేంజ్' వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్లో రానా కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement