రేణూ ఎంగేజ్‌మెంట్‌పై పవన్‌ స్పందన | Pawan Kalyan Wishes Renu Desai on Her Engagement | Sakshi
Sakshi News home page

Jun 26 2018 10:06 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Wishes Renu Desai on Her Engagement - Sakshi

నటి రేణూ దేశాయ్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్‌ నుంచి దూరం అయ్యాక ఆమె రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే రేణూ నిశ్చితార్థం ఘనంగా జరిగింది కూడా. అయితే జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇ‍వ్వకపోయినా.. ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌లతో ధృవీకరించారు.

ఈ క్రమంలో పవన్‌ ఈ ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ‘మిస్‌ రేణూగారు.. కొత్త జీవితంలోని అడుగుపెడుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను’ అని పవన్‌ ట్వీటేశారు. అయితే రేణూ దేశాయ్‌ను ఉద్దేశించి ‘మిస్‌’ అని పవన్‌ కల్యాణ్‌ సంబోధించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ట్వీట్‌ చక్కర్లు కొడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement