నేడు అన్నయ్యను కలువనున్న పవర్ స్టార్ | Sakshi
Sakshi News home page

నేడు అన్నయ్యను కలువనున్న పవర్ స్టార్

Published Sun, Oct 18 2015 3:58 PM

నేడు అన్నయ్యను కలువనున్న పవర్ స్టార్ - Sakshi

హైదరాబాద్: సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కల్యాణ్ ఆదివారం కలుసుకోనున్నారు. మరికాసేపట్లో పవన్ చిరంజీవి ఇంటికి రానున్నారు. 'బ్రూస్ లీ' లో నటించడం ద్వారా మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టిన అన్నయ్య చిరంజీవిని అభినందించేందుకు పవన్ రానున్నట్టు తెలుస్తున్నది. జనసేన పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా చిరంజీవిని కలుసుకోలేదు. మొన్నామధ్య జరిగిన చిరు 60వ జన్మదినోత్సవం సందర్భంగా అన్నయను కలిసి పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవిని పవన్ కలువడం ఇదే కావడం గమనార్హం.

తనయుడు రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా మళ్లీ చిరంజీవి వెండితెరపై మెరిశారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement