పవన్ ముఖ్య అతిథిగా జాగ్వర్ ఆడియో | Pawan Kalyan to attend Jaguar audio launch | Sakshi
Sakshi News home page

పవన్ ముఖ్య అతిథిగా జాగ్వర్ ఆడియో

Sep 18 2016 2:17 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ ముఖ్య అతిథిగా జాగ్వర్ ఆడియో - Sakshi

పవన్ ముఖ్య అతిథిగా జాగ్వర్ ఆడియో

మాజీ ప్రధాని మనవడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు.. నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం అవుతోన్న భారీ చిత్రం జాగ్వర్. ఈ సినిమా ఆడియో వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు కన్నడ భాషల్లో రూపొందిన....

మాజీ ప్రధాని మనవడు, మాజీ ముఖ్యమంత్రి తనయుడు.. నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం అవుతోన్న భారీ చిత్రం జాగ్వర్. ఈ సినిమా ఆడియో వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను ఆదివారం హైదరాబాద్ లోని నొవాటెల్ హోటల్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను కూడా అదే స్థాయిలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుక హాజరవుతుండటంతో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హజరవుతారని భావిస్తున్నారు. దీనికి తోడు హీరో నిఖిల్ కుమార్ రాజకీయా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వస్తుండటంతో రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా కూడా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మిత్రుడు సినిమాను డైరెక్ట్ చేసిన మహాదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో జగపతిబాబు, రమ్యకృష్ణ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement