చిరు పాటకు పవన్ స్టెప్పులు | Pawan kalyan Remix Chiranjeevi kondaveeti raja Song | Sakshi
Sakshi News home page

చిరు పాటకు పవన్ స్టెప్పులు

Mar 5 2016 11:10 AM | Updated on Mar 22 2019 5:33 PM

చిరు పాటకు పవన్ స్టెప్పులు - Sakshi

చిరు పాటకు పవన్ స్టెప్పులు

వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు వాళ్ల తండ్రులు తాతలు చేసిన పాటలను రీమిక్స్ చేయటం టాలీవుడ్లో తరుచుగా కనిపిస్తుంది. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీల నుంచి...

వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు వాళ్ల తండ్రులు, తాతలు చేసిన పాటలను రీమిక్స్ చేయటం టాలీవుడ్లో తరుచుగా కనిపిస్తుంది. నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీల నుంచి వచ్చిన అందరు హీరోలు దాదాపుగా ఈ ఫార్ములాను ఫాలో అయిన వాళ్లే. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి పాటను రీమిక్స్ చేయలేదు.

స్వతహాగా పాత పాటలను ఇష్టపడే పవర్ స్టార్ పాత సినిమా పాటలను రీమిక్స్ చేసినా ఎప్పుడూ చిరు పాటను మాత్రం వాడలేదు. తన తరువాత ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్లు మాత్రం మెగా పాటలను తెగ వాడేస్తున్నారు. దీంతో సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో తను కూడా అదే పని చేయడానికి ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. 80లలో చిరు ఆడి పాడిన ఓ పాటు తన నెక్ట్స్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు.

చిరంజీవి, రాధ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'కొండవీటి రాజా' సినిమాలోని 'నా కోక బాగుందా.. నా రైక బాగుందా..' అనే పాటను సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం పవన్ రీమిక్స్ చేస్తున్నాడు. ఈ పాటలో పవన్ సరసన లక్ష్మీ రాయ్ ఆడిపాడుతుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా చిరు పాటకు పవన్ చిందులు కన్ఫామ్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement