పవన్ మనసు మార్చుకున్నాడా..? | Pawan Kalyan next movie with Santhosh Srinivas | Sakshi
Sakshi News home page

పవన్ మనసు మార్చుకున్నాడా..?

Apr 18 2017 10:24 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ మనసు మార్చుకున్నాడా..? - Sakshi

పవన్ మనసు మార్చుకున్నాడా..?

సర్థార్ గబ్బర్సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

సర్థార్ గబ్బర్సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. కాటమరాయుడు రీమేక్ సినిమా కావటం, అది కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సినిమా కావటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. దీంతో పవన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా పునరాలోచనలో పడ్డాడు.

కాటమరాయుడు సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో వేదలం రీమేక్ను మొదలు పెట్టాడు పవన్.  ఆ తరువాత యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ పవన్ మరో రీమేక్ సినిమా చేస్తున్నాడన్న వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేయబోయేది రీమేక్ కాదని తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే ముందుగా సంతోష్ శ్రీనివాస్ సినిమానే మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు త్రివిక్రమ్ సినిమా తరువాత చేయాల్సిన వేదలం రీమేక్ను పక్కన పెట్టేయాలని భావిస్తున్నాడట. కాటమరాయుడు రిజల్ట్తో పవన్ రీమేక్ సినిమాల జోలికి వెళ్లకపోవటమే బెటర్ అని నిర్ణయించుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement