ఇది సంస్కృతి మీద దాడి : పవన్ కళ్యాణ్ | Pawan kalyan lend support to protests demanding Jallikattu | Sakshi
Sakshi News home page

ఇది సంస్కృతి మీద దాడి : పవన్ కళ్యాణ్

Jan 20 2017 11:31 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఇది సంస్కృతి మీద దాడి : పవన్ కళ్యాణ్ - Sakshi

ఇది సంస్కృతి మీద దాడి : పవన్ కళ్యాణ్

ఇటీవల సామాజిక అంశాలపై స్పందిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తమిళనాట సంచలనం సృష్టిస్తున్న జల్లికట్టు వివాదంపై స్పందించాడు. 'జల్లికట్టు, కోడిపందేలను నిషేదించటం

ఇటీవల సామాజిక అంశాలపై స్పందిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తమిళనాట సంచలనం సృష్టిస్తున్న జల్లికట్టు వివాదంపై స్పందించాడు. 'జల్లికట్టు, కోడిపందేలను నిషేదించటం భారత ప్రభుత్వం ద్రవిడుల సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేయటమే. తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో, తరువాత ఆంధ్రలో జరిగిన కొన్ని రాజకీయ సమావేశాల్లో నిషేదం అక్కడి ప్రజలను ఎంత వేదనకు గురి చేసిందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ప్రభుత్వం జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును నిషేదించింది. నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్, బీఫ్ ఎగుమతుల మీద చర్యలు తీసుకోవాలి' అంటూ ట్వీట్ చేశాడు.

ముందుగా తన ఫాం హౌస్ లో దిగిన ఫోటోను ట్వీట్ చేసిన పవన్, ' నా వెనక కనిపిస్తున్న ఆవు, దూడలు నా గోశాలలో 16కు పైగా ఉన్న ఆవు దూడల్లోనివి. నా ఫాంలో ఉన్న ఆవులు, కోడిపుంజులు.. దక్షిణాభారతంలో జల్లికట్టు, కోడిపందేలపై విధించిన నిషేదం గురించి నన్ను ఆలోచింప చేస్తున్నాయి' అంటూ కామెంట్ చేశాడు. పవన్ తో పాటు మహేష్ బాబు, అఖిల్ అక్కినేని లాంటి ఈ తరం కథానాయకులు తమిళ నాట జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement