'పవనిజం డే' జరుపుకుంటున్న మెగా ఫ్యాన్స్ | Pawan Kalyan fans celebrate Pawanism day | Sakshi
Sakshi News home page

'పవనిజం డే' జరుపుకుంటున్న మెగా ఫ్యాన్స్

Oct 11 2013 12:06 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవనిజం డే' జరుపుకుంటున్న మెగా ఫ్యాన్స్ - Sakshi

'పవనిజం డే' జరుపుకుంటున్న మెగా ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నేడు పవనిజం డే జరుపుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నేడు ప్రపంచవ్యాప్తంగా  పవనిజం డే జరుపుకుంటున్నారు. తాజాగా విడుదలయిన అత్తారింటికి దారేది సినిమా విజయవంతం కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో పవనిజం రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రేమికుల రోజు, చిల్డ్రన్ డే, మదర్స్ డే తరహాలో మెగా అభిమానులు పవనిజం డే జరుపుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా విడుదలయిన తేదీ కాబట్టి అక్టోబర్ 11న పవనిజం డే నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి' 1996 అక్టోబర్ 11న విడుదలయింది. చిరంజీవి సోదరుడి టాగ్తో తెరంగ్రేటం చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత సొంత ఇమేజ్ సృష్టించుకున్నారు. విలక్షణ నటన, ఆహార్యంతో యువతతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తనదైన వ్యక్తిత్వంతో యూత్ ని ఆకట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement