కూతురి బర్త్‌డే వేడుకలో పవన్ | pawan kalyan and Anna Lezhneva daughter birthday celebrations | Sakshi
Sakshi News home page

కూతురి బర్త్‌డే వేడుకలో పవన్

Mar 25 2017 9:05 PM | Updated on Mar 22 2019 5:33 PM

కూతురి బర్త్‌డే వేడుకలో పవన్ - Sakshi

కూతురి బర్త్‌డే వేడుకలో పవన్

టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ తన చిన్న కూతురి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో నిరంతరం బిజీగా ఉండే పవన్.. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని, వారి చిన్ని చిన్ని సంతోషాలను తీరుస్తారని మరోసారి రుజువైంది.

హైదరాబాద్: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ తన చిన్న కూతురి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో నిరంతరం బిజీగా ఉండే పవన్.. పిల్లల పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని, వారి చిన్ని చిన్ని సంతోషాలను తీరుస్తారని మరోసారి రుజువైంది. పవన్, అన్నా లెజ్‌నోవాల కూతురు పొలెనా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు, తన స్నేహితుల మధ్య పొలెనా కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకుంది.

తల్లిదండ్రులు పవన్, అన్నా లెజ్‌నోవాలు చెబుతుండగా కేక్ కట్ చేసింది. చిన్నారి పొలెనాకు ఇది 5వ జన్మదిన వేడుక అని క్యాండిల్‌ పై ఉంది. ఈ సందర్భంగా చిన్నారి పొలెనా దిగిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. మెగా అభిమానులు ఈ ఈవెంట్ వివరాలను రీట్వీట్ చేస్తున్నారు. ఈ వేడుక మాత్రం ఇటీవలే జరిగనట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ నటించిన 'కాటమరాయుడు' నిన్న (శుక్రవారం) విడుదలై మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది.



Advertisement
 
Advertisement
Advertisement