పాత్రలన్నీ కల్పితం | Pavan Tej Konidelas Ee Kathalo Pathralu Kalpitham pressmeet | Sakshi
Sakshi News home page

పాత్రలన్నీ కల్పితం

Jan 27 2020 3:12 AM | Updated on Jan 27 2020 3:12 AM

Pavan Tej Konidelas Ee Kathalo Pathralu Kalpitham pressmeet - Sakshi

పవన్‌ తేజ్, మేఘన

పవన్‌ తేజ్‌ కొణిదెలను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది. ఫస్ట్‌ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న నటుడిలా నటిస్తున్నారు. అభిరామ్‌ మేకింగ్‌ ఫ్రెష్‌గా ఉంది. మంచి థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌. సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ కుమార్‌ బ్యూటిఫుల్‌ విజువల్స్, తాజుద్దీన్‌ సయ్యద్‌ డైలాగ్స్‌ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి, లైన్‌ ప్రొడ్యూసర్‌: దుర్గా అనీల్‌ రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement