హీరో సూరి | Parotta Soori to play the lead in Vetrimaaran next | Sakshi
Sakshi News home page

హీరో సూరి

Jul 28 2019 6:32 AM | Updated on Jul 28 2019 6:32 AM

Parotta Soori to play the lead in Vetrimaaran next - Sakshi

హీరోగానూ నిరూపించుకోవాలనే హాస్య నటుల ప్రయత్నాలు ఏ ఇండస్ట్రీలో అయినా సాగుతూనే ఉంటాయి. వడివేలు, సంతానం, వివేక్, యోగిబాబు వంటి తమిళ హాస్యనటులు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి మరో కమెడియన్‌ సూరి కూడా చేరారు. ‘పరోటా’ సూరిగా తమిళంలో సూరి ఫేమస్‌. ఇప్పుడు సూరి హీరోగా చేయనున్న చిత్రానికి ‘ఆడుకాలమ్, వడ చెన్నై, అసురన్‌’ వంటి విలక్షణ చిత్రాలను తెరకెక్కించిన వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నారు. కమెడియన్‌గా మంచి మార్కులు కొట్టేసిన సూరి హీరోగా ఎన్ని మార్కులు దక్కించుకుంటారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement