మాఫియా కారణంగా... | paradise telugu movie shooting Started | Sakshi
Sakshi News home page

మాఫియా కారణంగా...

Aug 27 2014 11:02 PM | Updated on Sep 2 2017 12:32 PM

మాఫియా కారణంగా...

మాఫియా కారణంగా...

ఓ ప్రేమజంటను విడదీయడానికి మాఫియా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మాఫియా కారణంగా ఆ ప్రేమజంట చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో

 ఓ ప్రేమజంటను విడదీయడానికి మాఫియా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మాఫియా కారణంగా ఆ ప్రేమజంట చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ‘ప్యారడైజ్’ చిత్రం ఉంటుందంటున్నారు దర్శకుడు రవిచంద్రన్. షఫీ ప్రధాన పాత్రలో హేమంత్, షిప్రా జంటగా సత్యనారాయణ బత్స నిర్మిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి అల్లు రామకృష్ణ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. షఫీ మాట్లాడుతూ -‘‘చాలా మంచి కథ ఇది. ఇందులో నాది పోలీసాఫీసర్ పాత్ర’’ అని చెప్పారు. ఇది విభిన్న ప్రేమకథ అని, క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: యోగి, సంగీతం: స్ట్రింగ్స్ సతీశ్.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement