పడ్డాడండి ప్రేమలో మరి | Paper Boy Release Date Confirmed | Sakshi
Sakshi News home page

పడ్డాడండి ప్రేమలో మరి

Aug 9 2018 12:45 AM | Updated on Aug 9 2018 12:45 AM

Paper Boy Release Date Confirmed - Sakshi

సంతోష్‌ శోభన్, రియా సుమన్‌

‘గోల్కొండ హైస్కూల్‌’తో బాల నటుడిగా పరిచయమైన సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. జయశంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రియా సుమన్, తాన్యా హోప్‌ హీరోయిన్లుగా నటించారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్, బీఎల్‌ఎన్‌ సినిమా, ప్రచిత్ర క్రియేషన్స్‌ పతాకాలపై సంపత్‌ నంది, రాములు, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్‌ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జయశంకర్‌ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది.

ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగిందన్నదే చిత్రకథ. దర్శకుడు సంపత్‌ నంది ఈ సినిమాకి చక్కని కథ అందించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌కు 2.5 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, అభిషేక్‌ మహర్షి, విద్యుల్లేఖా రామన్, జయప్రకాశ్‌ రెడ్డి, సన్నీ, మహేశ్‌ విట్టా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: సౌందర రాజన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మురళి మామిళ్ల.

Advertisement
 
Advertisement
Advertisement