వారం రోజులు ముందుగానే వస్తున్నాం | Paper Boy Movie Title Song Video release | Sakshi
Sakshi News home page

వారం రోజులు ముందుగానే వస్తున్నాం

Aug 24 2018 5:06 AM | Updated on Aug 24 2018 5:06 AM

Paper Boy Movie Title Song Video release - Sakshi

భీమ్స్, జయశంకర్, సంతోష్‌ శోభన్, సంపత్‌ నంది, నరసింహులు, కాసర్ల శ్యామ్‌

సంతోష్‌ శోభన్, రియా సుమన్‌ జంటగా జయశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పేపర్‌ బాయ్‌’. తాన్యా హోప్‌ కీలక పాత్ర చేశారు. దర్శకుడు సంపత్‌ నంది, రాములు, వెంకట్, నరసింహులు నిర్మించారు. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ‘ఓయ్‌ ఓయ్‌...పేపర్‌ బాయ్‌’ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ రాశారు. భీమ్స్‌ స్వరకర్త. ప్రముఖ సంగీత దర్శకుడు చంద్రబోస్‌ ఈ పాటను పాడటం విశేషం. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా సెప్టెంబర్‌ 7న కాకుండా ఈ నెల 31న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపారు. సంపత్‌ నంది మాట్లాడుతూ –  ‘‘టీజర్, ట్రైలర్‌లతో పాటు ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు రోడ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేశాం.

పేపర్‌ బాయ్స్‌ ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. పాట పాడిన చంద్రబోస్‌గారికి, టీమ్‌ అందరి తరఫున థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘టెన్షన్‌ పడేంత టైమ్‌ కూడా లేదు. వారం రోజులు ముందే వస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. చంద్రబోస్‌గారిని అనుసరిస్తున్న శిష్యుల్లో నేను, కాసర్ల శ్యామ్‌ కూడా ఉన్నాం. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ పాడినందుకు చంద్రబోస్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు భీమ్స్‌. ‘‘నేను లిరిక్స్‌ అందించిన పాటకు చంద్రబోస్‌గారు గాత్రం అందించడం నా వరం. నా అదృష్టంగా భావిస్తున్నా. సంపత్‌ నంది మంచి డైలాగ్స్‌ రాశారు’’ అన్నారు కాసర్ల శ్యామ్‌. ఈ కార్యక్రమంలో నిర్మాత నరసింహులు, డైరెక్టర్‌ జయశంకర్, కెమెరామెన్‌ సౌందర రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement