గురుశిష్యులు | Pankaj Kapur reunites with son Shahid Kapoor for Hindi remake of Jersey | Sakshi
Sakshi News home page

గురుశిష్యులు

Dec 6 2019 1:03 AM | Updated on Dec 6 2019 1:03 AM

Pankaj Kapur reunites with son Shahid Kapoor for Hindi remake of Jersey - Sakshi

పంకజ్‌ కపూర్, షాహిద్‌ కపూర్‌

సాధారణంగా అందరికీ లైఫ్‌లో గురువు పాత్రను ఎక్కువగా తండ్రే పోషిస్తారు. బాలీవుడ్‌ నటుడు షాహిదీ కపూర్‌కు వాళ్ల నాన్న పంకజ్‌ కపూరే గురువు. ఇప్పుడు ఆన్‌స్క్రీన్‌ కూడా తనయుడికి గురువు పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సూపర్‌హిట్‌ సినిమా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించనున్నారు షాహిద్‌. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. అల్లు అరవింద్, ‘దిల్‌’ రాజు, అమన్‌ గిల్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాలో షాహిద్‌ మెంటర్‌గా (తెలుగులో సత్యరాజ్‌ పోషించిన పాత్ర) ఆయన తండ్రి పంకజ్‌ కపూర్‌ నటించనున్నారని తెలిసింది. ఈ నెలాఖారున షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌ 28న రిలీజ్‌ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement