మనసు పడి... | padi padi leche manasu teaser released on october 10 | Sakshi
Sakshi News home page

మనసు పడి...

Oct 9 2018 5:04 AM | Updated on Oct 9 2018 5:04 AM

padi padi leche manasu teaser released on october 10 - Sakshi

సాయిపల్లవి, శర్వానంద్‌

ప్రేయసిని చూడగానే శర్వానంద్‌ మనసు పడి పడి లేచిందట. ఆమె కోసం కోల్‌కత్తా, నేపాల్‌ మొత్తం తిరిగేసి ప్రేమ ప్రయాణం కూడా చేశారట. ఆ జర్నీ ఎలా ఉండబోతోందో కొంచెం రుచి చూపించబోతున్నాం అంటున్నారు శర్వానంద్‌.  హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను రేపు (అక్టోబర్‌ 10) విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘పడి పడి లేచె మనసు’ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఆల్రెడీ కోల్‌కత్తా, నేపాల్‌ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. శర్వానంద్, సాయి పల్లవి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. డిసెంబర్‌ 21న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్ర శేఖర్, కెమెరా: జయకృష్ణ గుమ్మడి.

Advertisement
 
Advertisement
Advertisement