ఆస్కార్‌లో కనిపించని ప్రియాంక.. | Oscars 2018 Heres why you didnt see Priyanka Chopra at the ceremony | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌లో కనిపించని ప్రియాంక.. కారణమిదే

Mar 5 2018 4:34 PM | Updated on Mar 5 2018 5:46 PM

Oscars 2018 Heres why you didnt see Priyanka Chopra at the ceremony - Sakshi

2017 ఆస్కార్‌ వేడుకల్లో ప్రియాంక

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి సత్తా చాటుకుంది ప్రియాంక చోప్రా.

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి సత్తా చాటుకుంది ప్రియాంక చోప్రా. క్వాంటికో’ టీవీ సిరీస్‌తో పాటు బేవాచ్ మూవీతో హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గ్లోబల్‌ స్టార్‌ అయింది. దీంతో ఈ ఏడాదికి గానూ 90వ అకాడమీ అవార్డ్స్ సెర్మనీలో అవార్డులు అందించే అరుదైన ఛాన్స్‌ని ప్రియాంక దక్కించుకుంది. కానీ ఆ అవకాశాన్ని ప్రియాంక చేజార్చుకుంది.

భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన అకాడమీ అవార్డులు వేడుకలకు అనారోగ్యం కారంణంగా ప్రియాంక హాజరుకాలేకపోయింది. ఈ విషయాన్ని ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ' నామినెట్‌ అయిన వాళ్లందరికీ ఆల్‌ ద బెస్ట్‌.. అసలు రాలేని స్థితిలో ఉన్నా..' అని బెడ్‌పై ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది. కాగా 2016, 2017 ఆస్కార్‌ వేడుకలో రెడ్‌ కార్పెట్‌పై నడిచి అలరించింది ప్రియాంక. 

Advertisement
 
Advertisement
Advertisement