ఆస్కార్ అవార్డుల ప్రెజెంటర్‌గా... | Oscar Awards presenter ... | Sakshi
Sakshi News home page

ఆస్కార్ అవార్డుల ప్రెజెంటర్‌గా...

Feb 2 2016 11:33 PM | Updated on Sep 3 2017 4:49 PM

ఆస్కార్ అవార్డుల ప్రెజెంటర్‌గా...

ఆస్కార్ అవార్డుల ప్రెజెంటర్‌గా...

2016 ఆస్కార్ వేడుకలో ప్రియాంకా చోప్రా అలానే సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ...

ఆస్కార్ అవార్డుల వేడుకలో ఎర్ర తివాచీపై ప్రియాంకా చోప్రా లాంటి అందగత్తె నడుస్తూ, ఒయ్యారాలు ఒలికిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఈ 2016 ఆస్కార్ వేడుకలో  ప్రియాంకా చోప్రా అలానే సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌తో ఒక్కసారిగా హాలీవుడ్ దృష్టిని ఆక ర్షించారామె. ఇప్పుడామెకు ఓ అరుదైన అవకాశం దక్కింది.

ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో ప్రియాంకా చోప్రా అవార్డు ప్రెజెం టర్‌గా సందడి చేయనున్నారు. ఈ నెల 28న జరగనున్న ఆస్కార్ వేడుకల్లో పాల్గొననున్న ప్రెజెంటర్ల జాబితాను  అకాడమీ వెబ్‌సైట్  మంగళవారం ప్రకటించింది. జూలియానా మూర్, రీస్ విదర్‌స్పూన్, జేకే సిమ్మన్స్ లాంటి ప్రఖ్యాత హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో ఉన్నారు. ఆ రోజు వేడుకల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రియాంక తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ మధ్య పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకున్న ప్రియాంక ఇటీవల స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అవార్డుల ఉత్సవంలోనూ ప్రెజెంటర్‌గా వ్యవహరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement