‘పారాసైట్‌’కి ఆస్కార్‌ అవార్డుల పంట

Oscar 2020: Parasite Film Wins Best Picture Award - Sakshi

లాస్‌ఏంజెల్స్‌ : దక్షిణ కొరియా చిత్రం పారాసైట్‌కు ఆస్కార్‌ అవార్డుల పంట పండింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ పిల్మ్‌ విభాగాల్లో అస్కార్‌ అవార్డులను దక్కించుకుంది. ముందు నుండి ఎన్నో అంచ‌నాల‌ని పెంచుకున్న పారాసైట్ చిత్రం ఆస్కార్ కిరీటం ద‌క్కించుకోవ‌డం విశేషం. మేకింగ్‌తో పాటు కంటెంట్‌లోను హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఈ సినిమాను తెరకెక్కించారు.

డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఓ ధ‌నిక కుటుంబాన్ని ఓ పేదకుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో ప‌నిలోకి ప్రవేశిస్తుంది. పేద‌, ధ‌నిక అంత‌రాల వ‌ల‌న స‌మాజంలో ఎలాంటి విపత్కర ప‌రిస్థితులు ఏర్పడుతాయో పారా సైట్ అనే చిత్రం ద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. 

చదవండి : ఆస్కార్‌ విజేతలు వీరే

లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో జ‌రుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో పారాసైట్‌ చిత్రంతో పాటు జోకర్‌, 1917 చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. జోకర్‌ చిత్రానికి గాను హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇక 1917 సినిమా మూడు విభాగాల్లో (విజువల్‌ ఎఫెక్ట్‌, సౌండ్‌ మిక్సింగ్‌, సినిమాటోగ్రఫీ) అవార్డులను ఎగరేసుకుపోయింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top