ఒక తార జీవితం | One star's life | Sakshi
Sakshi News home page

ఒక తార జీవితం

Aug 1 2015 11:56 PM | Updated on Sep 3 2017 6:35 AM

ఒక తార జీవితం

ఒక తార జీవితం

‘సితార’ అంటే సీనియర్ దర్శకుడు వంశీ తీసిన సినిమా టక్కున గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రానుంది.

 ‘సితార’ అంటే సీనియర్ దర్శకుడు వంశీ తీసిన సినిమా టక్కున గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రానుంది.  రవిబాబు, రవనీత్‌కౌర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జి.ఎల్ సురేంద్ర  దర్శకత్వంలో డి.ఎస్ రవికుమార్ నిర్మిస్తున్నారు. ‘‘సురేంద్ర కథ ఎంత బాగా చెప్పాడో, అంతకన్నా బాగా తీస్తున్నారు.
 
 త్వరలో పతాక సన్నివేశాల చిత్రీకరణ ఆరంభిస్తాం. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘అనుభవం ఉన్న దర్శకునిలా సురేంద్ర చాలా బాగా తీస్తున్నారు. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది’’ అని నటుడు రవిబాబు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి, ఎడిటింగ్: నందమూరి హరి.
 

Advertisement
 
Advertisement
Advertisement