మళ్లీ హోమ్‌వర్క్ చేశా! | once again i have done home work | Sakshi
Sakshi News home page

మళ్లీ హోమ్‌వర్క్ చేశా!

Mar 13 2015 11:26 PM | Updated on Sep 2 2017 10:47 PM

మళ్లీ హోమ్‌వర్క్ చేశా!

మళ్లీ హోమ్‌వర్క్ చేశా!

‘‘పాఠశాలలో చదువుకున్నప్పుడు హోమ్‌వర్క్ చేయక తప్పదు. నాకైతే ఇప్పుడూ తప్పడం లేదు. నా విద్యార్థి దశ గుర్తుకొస్తోంది.

‘‘పాఠశాలలో చదువుకున్నప్పుడు హోమ్‌వర్క్ చేయక తప్పదు. నాకైతే ఇప్పుడూ తప్పడం లేదు. నా విద్యార్థి దశ గుర్తుకొస్తోంది. ఇలా నేను గతంలోకి వెళ్లడానికి కారణం అమెరికన్ టీవీ రియాల్టీ షో ‘క్వాంటికో’. ఇది సాహసోపేతమైన షో కాబట్టి, ముందే ప్రాక్టీస్ చేయాలన్నారు. అందుకే కొన్ని రోజులు హోమ్‌వర్క్ చేశాను. బుధవారం చిత్రీకరణ మొదలైంది. ఇన్నాళ్లూ నేను చేసిన హోమ్‌వర్క్ చాలా ఉపయోగపడుతోంది.

మొదటి రోజే పదహారు గంటల పాటు నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొన్నాను. అన్నేసి గంటలు పని చేయడమంటే ఎంతటి శక్తిమంతులైనా అలసిపోతారు. కానీ, ఈ షూటింగ్ ఇచ్చిన మంచి అనుభూతి ముందు ఆ అలసట పెద్దగా అనిపించలేదు. కాసేపు కునుకు తీశా. దాంతో రీచార్జ్ అయ్యా. ఈ షో చిత్రీకరణ కొత్తగా ఉంది. మళ్లీ కెరీర్ మొదలుపెట్టినట్లుగా అనిపిస్తోంది. ఇందులో నేను అలెక్స్ వీవర్ అనే ‘ఎఫ్‌బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ట్రైనీగా నటిస్తున్నా.’’
 - ప్రియాంకా చోప్రా

Advertisement
 
Advertisement
Advertisement