విశిష్ట భక్తుడిగా నాగార్జున | On Namo Venkatesaya prelook released | Sakshi
Sakshi News home page

విశిష్ట భక్తుడిగా నాగార్జున

Aug 21 2016 3:15 PM | Updated on Jul 15 2019 9:21 PM

విశిష్ట భక్తుడిగా నాగార్జున - Sakshi

విశిష్ట భక్తుడిగా నాగార్జున

అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న భక్తిరస ప్రధాన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'.

అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న భక్తిరస ప్రధాన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'.  ఈ సినిమాలో నాగార్జున.. వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబాగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన ప్రీ లుక్ను ఆదివారం ఉదయం విడుదల చేశారు. నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన పాత్ర ప్రీ-లుక్ ను అభిమానులతో పంచుకున్నారు.

 ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఓం నమో వెంకటేశాయ' శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement