ఒకటే జీవితం | okkate life gets u certificate | Sakshi
Sakshi News home page

ఒకటే జీవితం

Feb 3 2019 5:48 AM | Updated on Feb 3 2019 5:48 AM

okkate life gets u certificate - Sakshi

జితన్‌ రమేష్‌, శ్రుతియుగల్‌

ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్‌’. ఎం.వెంకట్‌ దర్శకుడు. శ్రుతియుగల్‌ కథానాయిక. లార్డ్‌ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై నారాయణ్‌ రామ్‌ నిర్మించిన ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్‌ అందుకుంది. వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘నేటితరం టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోంది. హ్యూమన్‌ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్‌ పాటలు, రీ–రికార్డింగ్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.  ‘‘ఈ సినిమాను వెంకట్‌ తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావుగారు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని నారాయణ్‌ రామ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement