ఉన్నది ఒకటే జీవితం | 'Okate Life' trailer launched by Minister T Harish Rao | Sakshi
Sakshi News home page

ఉన్నది ఒకటే జీవితం

Aug 20 2018 1:16 AM | Updated on Aug 20 2018 1:16 AM

'Okate Life' trailer launched by Minister T Harish Rao - Sakshi

నారాయణ్‌ రామ్, హరీష్‌రావ్, వెంకట్‌

సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి. చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా పరిచయం కానున్న సినిమా ‘ఒకటే లైఫ్‌’. ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అనేది ఉప శీర్షిక. శృతియుగల్‌ కథానాయికగా నటించారు. ఎమ్‌.వెంకట్‌ దర్శకత్వంలో నారాయణ్‌ రామ్‌ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి టి.హరీష్‌రావు విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు బాగున్నాయి. అనుభవం ఉన్న దర్శకునిలా వెంకట్‌ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా హిట్‌ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.‘‘హారీష్‌రావుగారు మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రిలీజ్‌ అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ టెక్నాలజీ యుగంలో హ్యూమన్‌ రిలేషన్స్‌కు ఇంపార్టెన్స్‌ ఇవ్వాలన్న కాన్సెప్ట్‌ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు వెంకట్‌. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్‌ రామ్, బాబి, రిషి తదితరులు నటించిన ఈ సినిమాకు అమ్రీష్‌ సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement