క్లాసురా.. మాసురా! | 'nuvvu thopura'. This month the teaser will be released on 9th | Sakshi
Sakshi News home page

క్లాసురా.. మాసురా!

Jun 2 2017 11:31 PM | Updated on Sep 5 2017 12:40 PM

క్లాసురా.. మాసురా!

క్లాసురా.. మాసురా!

హీరో లుక్, టైటిల్‌ ఊర మాస్‌... దర్శక–నిర్మాతలు చెబుతున్న వివరాలు క్లాస్‌... మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి!

హీరో లుక్, టైటిల్‌ ఊర మాస్‌... దర్శక–నిర్మాతలు చెబుతున్న వివరాలు క్లాస్‌... మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి! ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేమ్‌ సుధాకర్‌ కోమాకుల హీరోగా బి. హరినాథ్‌బాబు దర్శకత్వంలో డి. శ్రీకాంత్‌ నిర్మిస్తున్న సినిమా ‘నువ్వు తోపురా’. నిత్యా శెట్టి హీరోయిన్‌.శుక్రవారం హీరో ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

‘‘కృష్ణవంశీ, వైవీయస్‌ చౌదరిల శిష్యుడైన హరినాథ్‌బాబు హాలీవుడ్‌ తరహా కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే 23న చిత్రీకరణ ప్రారంభమైంది. అమెరికాలో 70 శాతం, ఇండియాలో 30 శాతం చిత్రీకరణ జరుపుతాం. ఈ నెల 9న టీజర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ సినిమాకు కథ–మాటలు: అజ్జు మహంకాళి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, సౌండ్‌ డిజైనర్‌: పీఏ దీపక్, సమర్పణ: బేబి జాహ్నవి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దంతులూరి వర్మ, అమెరికా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: జేమ్స్‌ కొమ్ము, సహ నిర్మాత: రితేశ్‌కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement