ఎన్టీఆర్ 'టెంపర్' భారీ కలెక్షన్లు | NTR's Temper first week collections | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ 'టెంపర్' భారీ కలెక్షన్లు

Feb 23 2015 12:08 PM | Updated on Aug 28 2018 4:30 PM

జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది.

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. తొలి వారం భారీ వసూళ్లు రాబట్టింది. టెంపర్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన టెంపర్ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఇటీవలకాలంలో ఎన్టీఆర్ చిత్రాల్లో టెంపర్ అత్యధిక వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement