రావణుడిగా ఎన్టీఆర్.. జై లవకుశ ఫస్ట్ లుక్ | Ntr Jai lavakusa first look | Sakshi
Sakshi News home page

రావణుడిగా ఎన్టీఆర్.. జై లవకుశ ఫస్ట్ లుక్

May 19 2017 3:22 PM | Updated on Sep 5 2017 11:31 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలోనటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ  సినిమాలోనటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావటం, ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండటం లాంటి అంశాలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి.

ఉగాది కానుకగా సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేశారు. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ ను రివీల్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో పది తలల రావణుడ్ని హైలెట్ చేస్తు కారు దిగుతున్న స్టైలిష్ ఎన్టీఆర్ లుక్ సూపర్బ్ గా ఉంది. మరో పోస్టర్ లో చేతికి ఇనుప సంకెళ్లతో దండం పెడుతున్న స్టిల్ ను రిలీజ్ చేసిన యూనిట్, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement