ఈ ఏడాదికి మెగా సినిమా లేనట్టే..? | no mega movie in 2016 second half | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదికి మెగా సినిమా లేనట్టే..?

Jun 5 2016 11:40 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఈ ఏడాదికి మెగా సినిమా లేనట్టే..? - Sakshi

ఈ ఏడాదికి మెగా సినిమా లేనట్టే..?

2016 మొదట్లో వరుసగా సినిమాలు రిలీజ్ చేసిన మెగా హీరోలు ద్వితీయార్థంలో మాత్రం వెండితెరకు దూరంగా ఉంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏ ఒక్క మెగా హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం...

2016 మొదట్లో వరుసగా సినిమాలు రిలీజ్ చేసిన మెగా హీరోలు ద్వితీయార్థంలో మాత్రం వెండితెరకు దూరంగా ఉంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏ ఒక్క మెగా హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించటం లేదు. గత ఏడాది చివర్లో బ్రూస్ లీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన చరణ్, తన నెక్ట్స్ సినిమాగా ఎనౌన్స్ చేసిన ధృవను ఇంత వరకు పూర్తి స్ధాయిలో సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. దీంతో ఈ ఏడాదిలో ధృవ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించటం లేదు.

డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కూడా రెండు సినిమాలు ఎనౌన్స్ చేసినా.. ఏ ఒక్కటీ పట్టాలెక్కించలేదు. భారీ అంచనాల మధ్య సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ కూడా ప్రస్తుతం హాలీడే మూడ్లోనే ఉన్నాడు. ఇంత వరకు తన నెక్ట్స్ సినిమా ప్రారంభించలేదు. ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్ అయితే సరైనోడు సినిమా తరువాత తను చేయబోయే సినిమా ఏంటో కూడా ప్రకటించలేదు. అందుకే ఈ హీరోల సినిమాలేవి 2016లో రిలీజ్ అయ్యే అవకాశమే లేదు.

ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా చాలా రోజులుగా ఊరిస్తున్నా.. ఎప్పుడూ సెట్స్ మీదకెళుతుందో తెలీదు. ఒక వేళ వెంటనే షూటింగ్ స్టార్ట్ అయినా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కావటంతో రిలీజ్కు చాలా సమయం పడుతోంది. కాబట్టి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కూడా ఈ ఏడాదిలో ఉండే అవకాశం లేదు.

ఒక్క సాయిధరమ్ తేజ్ మాత్రం ఈ ఏడాదిలోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావచ్చింది. ఈ ఏడాది  ద్వితీయార్థంలో మెగా అభిమానులను అలరించడానికి సాయి సినిమా ఒక్కటే రానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement