కాలా నష్టం కాలా! | no loss for kaala movie collections | Sakshi
Sakshi News home page

కాలా నష్టం కాలా!

Jul 9 2018 1:12 AM | Updated on Sep 12 2019 10:40 AM

no loss for kaala movie collections - Sakshi

రజనీకాంత్‌

‘కాలా’ సినిమా కలెక్షన్స్‌కి సంబంధించిన పుకార్లకు చిత్రబృందం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ‘కాలా’ చిత్రం వల్ల తమకు నష్టాలు రాలేదని సదరు నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేసింది. రజనీకాంత్‌ హీరోగా ‘కబాలి’ ఫేమ్‌ పా. రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. ఈశ్వరీ రావు, హ్యూమా ఖురేషి కథానాయికలుగా నటించారు. వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రజనీకాంత్‌ అల్లుడు, దర్శక–నిర్మాత, నటుడు ధనుష్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 7న తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజైంది.

అయితే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్‌ అవ్వడంవల్ల నిర్మాణ సంస్థకు ఆశించిన ఫలితాలు రాలేదని తమిళ మీడియాలో ఆర్టికల్స్‌ వచ్చాయట. ఈ విషయంపై యూనిట్‌ స్పందించింది. ‘‘కాలా’ సినిమాకు సరైన కలెక్షన్స్‌ రాలేదని మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు అవాస్తవం. మాకు ‘కాలా’ సక్సెస్‌ఫుల్‌ అండ్‌ ప్రాఫిటబుల్‌ ప్రాజెక్ట్‌. మా బ్యానర్‌లో సినిమా చేసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు, అలాగే సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు «థ్యాంక్స్‌’’ అని వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ ప్రతినిధులు సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement