ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అంటున్న హీరోయిన్‌ | Nivetha Thomas Tweets On Nani Krishnarjuna Yudham | Sakshi
Sakshi News home page

నాని సినిమాకు ఫస్ట్‌షోకి వెళ్తా : నివేదా

Mar 11 2018 5:13 PM | Updated on Mar 11 2018 5:43 PM

Nivetha Thomas - Sakshi

నివేదా ధామస్‌

సొంత సినిమా ప్రమోషన్‌లకు కూడా హాజరవ్వలేనంత బిజీగా ఉంటున్నారు కొందరు. అలాంటిది తన స్నేహితుడి సినిమా టీజర్‌పై స్పందిస్తూ సినిమాను ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూస్తానంటూ ట్వీట్‌ చేసింది. ఆడోళ్లు భలే కఠినాత్ములు అంటూ వచ్చిన కృష్ణార్జున యుద్ధం టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్‌​కు సోషల్‌ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. నానితో రెండుసార్లు జతకట్టి హిట్‌పెయిర్‌గా నిలిచిన నివేదా థామస్‌ టీజర్‌పై ట్విటర్‌లో స్సందించింది.

‘ఈ టీజర్‌లో ఏదో ఉంది. నిన్ను చూసి గర్వపడుతున్నాను నాని. మొదటి రోజు మొదటి ఆటకు సినిమాను చూస్తా’ అని ట్వీట్‌ చేసింది. నాని, నివేధా జెంటిల్‌మెన్‌, నిన్ను కోరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.  కృష్ణార్జున యుద్ధం సినిమాలో నానికి జోడిగా అనుపమా పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్‌ జోడిగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 12న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement