డాటరాఫ్‌ రజనీకాంత్‌?

Nivetha Thomas May Play Rajinikanth Daughter In Murugadoss Film - Sakshi

రజనీకాంత్‌ కొత్త చిత్రం గురించి రోజుకో న్యూస్‌ బయటకు వస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలో రజనీ కుమార్తెగా నివేదా థామస్‌ కనిపించనున్నారని టాక్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ„ న్స్‌ నిర్మించనున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌. ఇందులో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో సినిమాకి కీలకంగా నిలిచే రజనీకాంత్‌ కుమార్తె పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం నివేదా థామస్‌ను సంప్రదించారట చిత్రబృందం.

ఆల్రెడీ ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’ తమిళ రీమేక్‌) సినిమాలో కమల్‌ హాసన్‌ కుమార్తెగా నివేదా థామస్‌ కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నివేదాకు పెద్ద ప్లస్‌ అయింది. మరి రజనీ కుమార్తెగా కూడా నటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రజనీ లుక్‌ టెస్ట్‌ జరిగింది. ఆ స్టిల్స్‌ కొన్ని ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. ఏప్రిల్‌ 10న ముంబైలో షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రానికి అనిరుథ్‌ సంగీత దర్శకుడు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top