ఆయనతో చేసేందుకు భయపడ్డా: నటి | nivetha pethuraj in tic tic tic movie | Sakshi
Sakshi News home page

ఆయనతో చేసేందుకు భయపడ్డా: నటి

Jul 8 2017 5:15 PM | Updated on Aug 9 2018 7:28 PM

ఆయనతో చేసేందుకు భయపడ్డా: నటి - Sakshi

ఆయనతో చేసేందుకు భయపడ్డా: నటి

ఆయన గర్వంలేని నటుడు అని తెగ పొగిడేస్తోంది వర్ధమాన నటి నివేదా పేతురాజ్‌.

తమిళసినిమా: ఆయన గర్వంలేని నటుడు అని తెగ పొగిడేస్తోంది వర్ధమాన నటి నివేదా పేతురాజ్‌. నటీనటులు చాలా చిత్రాలు చేస్తుంటారు. అయితే అందులో కొన్ని చిత్రాలపైన నమ్మకం పెరుగుతుంది. పలాన చిత్రం తన కెరీర్‌లో మలుపురాయిగా నిలిచిపోతుందనే భావన కలుగుతుందని నటి నివేదా పేతురాజ్‌ అన్నారు. ఈ బ్యూటీ ఏమంటుందో చూద్దాం. నేను నటించిన తొలి చిత్రం ఒరునాళ్‌కూత్తు మంచి సక్సెస్‌ను అందించింది. మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నా చేతిలో మూడు చిత్రాలున్నాయి.

వాటిలో జయం రవితో నటిస్తున్న టిక్‌ టిక్‌ టిక్‌ ఒకటి. ఇందులో తాను ఏంజిల్‌ గెటప్‌లో కనిపిస్తానని చెప్పింది. స్టార్‌ హీరో జయం రవికు జంటగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆయనతో కలిసి నటించడానికి ముందు చాలా భయపడ్డానని ఆమె అన్నారు.  కాని ఆయన మాత్రం చాలా సౌమ్యంగా సన్నివేశంలో నటించేటప్పుడు ఎన్ని టేక్‌లు తీసుకున్నా సహనం పాటించారు. నిజంగా ఆయన గ్రేట్‌. ఎంత నిరాడంబరుడో అని రవిని పొగిడింది. 

టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలో నాది చాలా బలమైన పాత్ర అని ఈ చిత్ర విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇక ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. అదేవిధంగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది చాలా జాలీగా సాగే కథా చిత్రంగా ఉంటుంది అని నివేదాపెతురాజ్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement