ఎన్టీఆర్ సినిమాలో 'జెంటిల్మన్' బ్యూటి | Niveda Thomas with jr ntr | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సినిమాలో 'జెంటిల్మన్' బ్యూటి

Jun 28 2016 8:47 AM | Updated on Sep 4 2017 3:38 AM

ఎన్టీఆర్ సినిమాలో 'జెంటిల్మన్' బ్యూటి

ఎన్టీఆర్ సినిమాలో 'జెంటిల్మన్' బ్యూటి

ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న మళయాలి ముద్దుగుమ్మ నివేదా థామస్.

ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న మళయాలి ముద్దుగుమ్మ నివేదా థామస్. నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నివేదా. ఈ సినిమాలో తన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న ఈ భామ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. అందం, అభినయం రెండు ఉండటంతో స్టార్ హీరోలు కూడా నివేదాతో జతకట్టేందుకు రెడీ అవుతున్నారు.

అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది నివేదా. పస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న జూనియర్, ఆ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో నటించనున్నాడు. హీరో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నివేదా థామస్ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే నివేధా పాత్రపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement