చిన్నదాన నీకోసం... | Nitin-Karunakaran's Movie Titled Chinnadana Nee Kosam | Sakshi
Sakshi News home page

చిన్నదాన నీకోసం...

Aug 5 2014 10:45 PM | Updated on Sep 2 2017 11:25 AM

చిన్నదాన నీకోసం...

చిన్నదాన నీకోసం...

గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు... ఒక్కసారి హైవే ఎక్కితే ఎలా ఉంటుంది? అచ్చంగా నితిన్ కెరీర్ అలాగే ఉంది. వరుస విజయాలతో విమాన వేగంతో దూసుకుపోతున్నాడు నితిన్.

 గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు... ఒక్కసారి హైవే ఎక్కితే ఎలా ఉంటుంది? అచ్చంగా నితిన్ కెరీర్ అలాగే ఉంది. వరుస విజయాలతో విమాన వేగంతో దూసుకుపోతున్నాడు నితిన్. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఈ విజయాలను ఇలాగే కొనసాగించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు నితిన్. అందుకే తన ఇమేజ్‌కు తగ్గట్టుగా చక్కని ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలనే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘చిన్నదాన నీకోసం’ అనే పేరును ఖరారు చేశారనేది తాజా సమాచారమ్. తను నటించిన ‘ఇష్క్’ చిత్రంలోని ‘చిన్నదాన నీకోసం...’పాట పల్లవిలోని తొలి పదాన్నే తన సినిమా టైటిల్‌గా చేసుకోవడం విశేషం. నితిన్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం రూపొందుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement