స్పెయిన్‌లో ‘హార్ట్ ఎటాక్’ | Nitin and Puri Jagannath shooting in Spain for Heart Attack | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో ‘హార్ట్ ఎటాక్’

Oct 5 2013 12:50 AM | Updated on Mar 22 2019 1:53 PM

స్పెయిన్‌లో ‘హార్ట్ ఎటాక్’ - Sakshi

స్పెయిన్‌లో ‘హార్ట్ ఎటాక్’

టైటిల్ నుంచే ప్రేక్షకులలో అసక్తిని రేకెత్తించడం పూరిజగన్నాథ్ ప్రత్యేకత. టైటిల్స్‌కి తగ్గట్టే ఆయన సినిమాలు కూడా కొత్తగా ఉంటాయి. ప్రస్తుతం ‘హార్ట్ ఎటాక్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారాయన.

టైటిల్ నుంచే ప్రేక్షకులలో అసక్తిని రేకెత్తించడం పూరిజగన్నాథ్ ప్రత్యేకత. టైటిల్స్‌కి తగ్గట్టే ఆయన సినిమాలు కూడా కొత్తగా ఉంటాయి. ప్రస్తుతం ‘హార్ట్ ఎటాక్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారాయన. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్ కథానాయకునిగా స్వీయదర్శకత్వంలో పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
 ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. ప్రస్తుతం నితిన్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. యాభై రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరుగుతుందని యూనిట్ వర్గాల సమాచారం. వైవిధ్యమైన కథాకథనాలతో ప్రేమ, యాక్షన్ మిళితమైన ఎంటర్‌టైనర్‌గా పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. 
 
 నితిన్ లుక్ ఈ చిత్రంలో కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాల భోగట్టా. ఆదాశర్మ ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ తారాగణం నటించే ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: అమోల్ రాథోడ్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement