చైతూకి జోడిగా లక్కీ స్టార్‌ | Nithya Menon Share Screen With Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Dec 5 2018 10:13 AM | Updated on Dec 5 2018 10:13 AM

Nithya Menon Share Screen With Naga Chaitanya - Sakshi

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కెరీర్‌ ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుంది. ఒక హిట్ వస్తే రెండు వరుస ఫ్లాప్‌లు ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల సవ్యసాచి సినిమాతో నిరాశపరిచిన చైతూ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాతో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి సినిమా కావటంతో మజిలీపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా చైతూ ఒకే చేసినట్టుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నాగచైతన్య ఓకె చెప్పాడట. ఈ సినిమాకు హీరోయిన్‌గా నిత్య మీనన్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. వరుస ఫ్లాప్‌లలో ఉన్న హీరోలు నిత్యాతో కలిసి నటిస్తే సక్సెస్ వస్తుందన్న సెంటిమెంట్‌ ఇండస్ట్రీలో ఉంది. అందుకే చైతూ సినిమా కోసం నిత్యాను తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement