ఎక్కడుందో నా లవర్‌? | nithin bheeshma released on christmas | Sakshi
Sakshi News home page

ఎక్కడుందో నా లవర్‌?

Aug 29 2019 12:19 AM | Updated on Aug 29 2019 12:19 AM

nithin bheeshma released on christmas - Sakshi

నితిన్‌

భీష్మ.. ఓ బ్యాచిలర్‌. గాళ్‌ఫ్రెండ్‌ కోసం తెగ వెతుకుతున్నాడు. ఇంతకీ తనకు గాళ్‌ఫ్రెండ్‌ దొరికిందా? ఆ విషయం క్రిస్మస్‌కు తెలుస్తుంది. నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. రష్మికా మందన్నా కథానాయిక. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్‌ సీజన్‌లో రిలీజ్‌ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘చేతిలో ఫ్లవర్‌.. ఎవరవుతారో నా లవర్‌. క్రిస్మస్‌ తాత సాంటా క్లాజే నాకు గాళ్‌ ఫ్రెండ్‌ని గిఫ్ట్‌ ఇస్తాడనుకుంటున్నాను. ‘భీష్మ’ మీ అందర్నీ క్రిస్మస్‌కు ఎంటర్‌టైన్‌ చేస్తాడు’’ అని నితిన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement