సక్సెస్ కోసం సీక్వెల్ చేస్తున్న నితిన్ | Nithin Again Movie With Konda Vijay Kumar | Sakshi
Sakshi News home page

సక్సెస్ కోసం సీక్వెల్ చేస్తున్న నితిన్

Mar 16 2016 7:31 PM | Updated on Sep 3 2017 7:54 PM

సక్సెస్ కోసం సీక్వెల్ చేస్తున్న నితిన్

సక్సెస్ కోసం సీక్వెల్ చేస్తున్న నితిన్

యంగ్ హీరో నితిన్ సక్సెస్ కోసం సీక్వెల్ ఫార్ములాను నమ్ముతున్నాడు. చాలా కాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరోకు ఇష్క్ సినిమాతో కెరీర్ గాడిలో పడినట్టుగా కనిపించినా...

యంగ్ హీరో నితిన్ సక్సెస్ కోసం సీక్వెల్ ఫార్ములాను నమ్ముతున్నాడు. చాలా కాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ యంగ్ హీరోకు ఇష్క్ సినిమాతో కెరీర్ గాడిలో పడినట్టుగా కనిపించినా ఒకటి రెండు హిట్స్ తరువాత తిరిగి ఫ్లాప్స్ పలకరించాయి. దీంతో సక్సెస్ కోసం సీక్వెల్ ఫార్ములాను ఆశ్రయిస్తున్నాడు నితిన్. తన కెరీర్లో బిగెస్ట్ హిట్గా నిలిచిన సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడు.

ఇష్క్ సక్సెస్ తరువాత అదే జోరును కంటిన్యూ చేస్తూ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మరో విజయం సాధించాడు నితిన్. అయితే ఈ రెండు సక్సెస్ల తరువాత అదే స్థాయిలో విజయం సాధించటంలో నితిన్ తడబడుతున్నాడు. ఆ తరువాత చేసిన హార్ట్ ఎటాక్, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి సినిమాలు నితిన్కు ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేస్తున్న అ.. ఆ.. సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు నితిన్.

ఈ సినిమా తరువాత కూడా మరోసారి సేఫ్ గేమ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తనకు గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఆ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement