ఫోర్‌ మిలియన్‌ వ్యూస్‌.. థ్యాంక్స్‌ చెప్పిన నితిన్‌ | Nithiin Say Thanks For Bheeshma Movie First Glimpse On Trending | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో ‘భీష్మ’.. కృతజ్ఞతలు తెలిపిన నితిన్‌

Nov 9 2019 4:37 PM | Updated on Nov 9 2019 4:57 PM

Nithiin Say Thanks For Bheeshma Movie First Glimpse On Trending - Sakshi

ఇప్పుడు ఎక్కడా విన్నా, చూసినా యంగ్‌ హీరో నితిన్‌ ‘భీష్మ’సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ గురించే చర్చ జరుగుతోంది. ‘ఛలో’ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌, రష్మికా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కుర్రకారును పిచ్చెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ బర్త్‌డే సందర్బంగా ‘భీష్మ’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరిట టీజర్‌ రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్‌ ట్రెండింగ్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉండటంతో పాటు ఇప్పటికే నాలుగు మిలియన్‌ వ్యూస్‌ను రాబట్టడం విశేషం. నితిన్‌ యాటిట్యూడ్‌కు తోడు రష్మికా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్‌ ముఖ్యంగా లవర్స్‌కు తెగ కనెక్ట్‌ చేసేలా చేశాయి. ఇక ‘భీష్మ’పస్ట్‌ గ్లింప్స్‌ వస్తున్న ఆధరణతో చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేస్తోంది. 

ఈ సందర్భంగా హీరో నితిన్‌ ట్విటర్‌ వేదికగా కృతఙ్ఞతలు తెలిపాడు. కాగా, చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ‘మా గురుజీ త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘భీష్మ’మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేయడం జరిగింది. దీనికి ప్రేక్షకులనుంచి అనూహ్య రీతిలో భారీ స్పందన లభించింది. నితిన్‌, రష్మికా జంట చూడముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్‌ అయ్యాయి. అంతకుమందు దీపావళి కానుకగా విడుదలైన చిత్ర పోస్టర్స్‌కు కూడా విశేష స్పందన వచ్చింది. భీష్మ చిత్ర కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతీ యువకుడు  నితిన్‌ క్యారెక్టర్‌కి కనెక్ట్‌ అయ్యే విధంగా డిజైన్‌ చేశాం. అలాగే రష్మిక క్యారెక్టర్‌కు ప్రతీ యువతి కనెక్ట్‌ అవ్వడం ఖాంయం. ఇది ఒక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగడంతో పాటు వినోదాత్మకంగా ఉంటుంది’అని దర్శకుడు తెలిపాడు. ఇక నరేశ్‌, సంపత్‌, రఘుబాబు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పిబ్రవరి 21 న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement