వైభవ్‌ కోరి... | ninnu kori movie tamil remake | Sakshi
Sakshi News home page

వైభవ్‌ కోరి...

Aug 31 2018 5:20 AM | Updated on Aug 31 2018 5:20 AM

ninnu kori movie tamil remake - Sakshi

వైభవ్‌

‘అర్జున్‌ రెడ్డి, అత్తారింటికి దారేది, ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత మరో తెలుగు సినిమా తమిళంలోకి ఎగుమతి కానుంది. 2017లో రిలీజ్‌ అయిన ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో వైభవ్‌. దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్‌ అనే సంగతి గుర్తుండే ఉంటుంది. ‘గొడవ’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమిళంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు.

శివా నిర్వాణ దర్శకత్వంలో నాని, ఆది పినిశెట్టి, నివేథా ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘నిన్ను కోరి’. తెలుగులో నాని పోషించిన క్యారెక్టర్‌ను తమిళంలో వైభవ్‌ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, నివేథా పాత్రలను ఇంకా ఫైనలైజ్‌ చేయాల్సి ఉంది. ఈ రీమేక్‌ను కాస్మో కిరణ్‌ నిర్మించనున్నారు. ఇంకా దర్శకుడు ఎంపిక పూర్తి కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement