'నిన్ను కోరి' మూవీ రివ్యూ
టైటిల్ : నిన్నుకోరి

జానర్ : రొమాంటిక్ డ్రామా

తారాగణం : నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ, పృథ్వీ

సంగీతం : గోపి సుందర్

దర్శకత్వం : శివ నిర్వాణ

నిర్మాత : డివివి దానయ్యవరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డివివి దానయ్య నిర్మించిన నిన్నుకోరి, నాని జైత్రయాత్రను కొనసాగిస్తుందా..? నిన్నుకోరి హీరోగా నాని స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందా..?కథ :

ఉమా మహేశ్వరరావు (నాని), వైజాగ్ ఆంధ్రయూనివర్సిటీలో పి.హెచ్.డీ చేసే అనాథ కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి సాయంతో చదువుకునే ఉమా.. గీతమ్స్ కాలేజ్ లో చదువుకునే పల్లవి(నివేదా థామస్) తో ప్రేమలో పడతాడు. పల్లవి ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. అదే సమయంలో పల్లవి తండ్రి(మురళీ శర్మ) జీవితంలో సెటిల్ అవ్వని వాళ్లకు ఏ తండ్రీ తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడు అని చెప్పిన మాటలతో.. ఎలాగైన జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని పల్లవిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.తన పిహెచ్ డీ కోసం ఢిల్లీ వెళ్లిపోతాడు. పల్లవి తన పేరెంట్స్ చూసిన అరుణ్ (ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవుతుంది. అంతా మరిచిపోయి హాయిగా జీవిస్తున్న పల్లవి జీవితంలోకి ఉమా ఎందుకు తిరుగొచ్చాడు..? పల్లవి దూరమయ్యాక ఉమా ఏమయ్యాడు..? ఉమాని తిరిగి కలిశాక పల్లవి అరుణ్కు దూరమైందా..? లేక ఉమానే పల్లవికి దూరమయ్యాడా...? అన్నదే మిగతా కథ.నటీనటులు :

నేచురల్ స్టార్ నాని నటుడిగా మరోసారి తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు. తన స్టైల్ అల్లరి సీన్స్ గిలిగింతలు పెట్టిన నాని, చాలా సీన్స్ లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. విలన్ లేని సినిమాలో అక్కడక్కడే తానే విలన్ బాధ్యత తీసుకొని కథను ముందుకు నడిపించాడు. మరో హీరో ఆది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తక్కువ మాటలతో సెటిల్ ఫర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఆది నటన సూపర్బ్. హీరోయిన్ గా నివేదా బెస్ట్ చాయిస్ అనిపించుకుంది. ఇప్పటికే జెంటిల్మేన్ సినిమాతో నానికి జోడిగా నటించిన నివేదా మరోసారి మంచి కెమిస్ట్రీతో అలరించింది. ఫస్ట్ హాఫ్ లో అల్లరి అమ్మాయిగా కనిపించిన నివేదా, సెకండ్ హాఫ్ లో హుందాగా కనిపించి మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో నివేదా నటన ప్రతీ ఒక్కరి గుండె బరువెక్కిస్తుంది. తండ్రి పాత్రలో మురళి శర్మ మరోసారి ఆకట్టుకోగా, తనికెళ్ల భరణి, పృథ్వి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.సాంకేతిక నిపుణులు :

తొలి సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ అందరి దృష్టిని ఆకర్షించాడు. కథా ,కథనాలను అతను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ట్రయాంగులర్ లవ్ స్టోరిని మూడు గంటలపాటు కదల కుండా కూర్చో బెట్టే ఎమోషనల్ జర్నీగా మార్చటంలో శివ సక్సెస్ సాధించాడు. సినిమా అంతా ఎంతో జాగ్రత్తగా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ముగించినట్టుగా అనిపించింది. ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరించిన కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు శివతో కలిసి కోన అందించిన మాటలు సినిమాకు మరో ఎసెట్. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, వైజాగ్ అందాలతో పాటు ఫారిన్ లోకేషన్స్ ను అద్భుతంగా చూపించాడు కార్తీక్. గోపిసుందర్ సంగీతం ప్రతీ సీన్లో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే చేసింది.ప్లస్ పాయింట్స్ :

నాని, ఆది, నివేదాల నటన

ఎమోషనల్ సీన్స్మైనస్ పాయింట్స్ :

హడావిడిగా ముగిసిన క్లైమాక్స్


 


నిన్ను కోరి.. నాని విజయయాత్ర కొనసాగిస్తుంది.
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top