జర్నలిస్ట్‌ ముద్ర | Nikhil's MUDRA Release on November 8 | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ ముద్ర

Aug 11 2018 12:23 AM | Updated on Aug 11 2018 12:23 AM

Nikhil's MUDRA Release on November 8 - Sakshi

నిఖిల్, లావణ్యా త్రిపాఠి

నిఖిల్‌ సిద్ధార్థ్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ముద్ర’. టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో కావ్య వేణుగోపాల్, రాజ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. జర్నలిజం నేపథ్యంలో ఉంటుంది. కరెంట్‌ ఇష్యూస్‌ సాల్వ్‌ చేయడంలో మీడియా ఎటువంటి కీలకపాత్ర పోషిస్తుంది? అనే విషయాన్ని మా చిత్రంలో చూపించనున్నాం. నిఖిల్‌ తొలిసారి జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. నిఖిల్‌ ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆఖరి షెడ్యూల్‌ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్‌ కల్లా షూటింగ్‌ పూర్తి చేసి, నవంబర్‌ 8న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బి.మధు, కెమెరా: సూర్య, సంగీతం: సామ్‌ సి.ఎస్‌.

Advertisement
 
Advertisement
Advertisement