దెయ్యం.. అబ్బాయిని ప్రేమిస్తే! | Nikhil next with tiger fame anand | Sakshi
Sakshi News home page

దెయ్యం.. అబ్బాయిని ప్రేమిస్తే!

Oct 15 2015 2:34 PM | Updated on Sep 3 2017 11:01 AM

దెయ్యం.. అబ్బాయిని ప్రేమిస్తే!

దెయ్యం.. అబ్బాయిని ప్రేమిస్తే!

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిత్ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం శంకరాభరణం షూటింగ్లో బిజీగా...

వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిల్ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ప్రస్తుతం శంకరాభరణం షూటింగ్లో బిజీగా ఉన్న నిఖిల్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేయనున్నాడు. ఇటీవల పవర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ రావటంతో ఈ సినిమా సక్సెస్ మీద కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు.

వరుసగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్న నిఖిల్ తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఓ దెయ్యం ...అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడట.  దసరా సందర్భంగా సినిమా షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

'అమల' అనే టైటిల్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ శిష్యుడు ఆనంద్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ రెండో ప్రయత్నంగా నిఖిల్ తో అమల సినిమాను రూపొందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement