స్వామిరారా కాంబినేషన్లో మరో సినిమా | Nikhil and Sudheer Varma to reunite | Sakshi
Sakshi News home page

స్వామిరారా కాంబినేషన్లో మరో సినిమా

Jul 27 2016 9:01 AM | Updated on Sep 4 2017 6:35 AM

స్వామిరారా కాంబినేషన్లో మరో సినిమా

స్వామిరారా కాంబినేషన్లో మరో సినిమా

సక్సెస్ కోసం పోరాడుతున్న సమయంలో నిఖిల్ కెరీర్ను మలుపు తిప్పిన సక్సెస్ ఫుల్ సినిమా స్వామి రారా. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈసినిమా ఘనవిజయం సాధించటంతో నిఖిల్ వరుస సినిమాలతో...

సక్సెస్ కోసం పోరాడుతున్న సమయంలో నిఖిల్ కెరీర్ను మలుపు తిప్పిన సక్సెస్ ఫుల్ సినిమా స్వామి రారా. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈసినిమా ఘనవిజయం సాధించటంతో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా అయిపోయాడు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ తరువాత నాగచైతన్య హీరోగా దోచెయ్ సినిమాను తెరకెక్కించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

అందుకే కొంత గ్యాప్ తీసుకున్న సుధీర్ వర్మ మరోసారి నిఖిల్ హీరోగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నిఖిల్, ఈ సినిమా పూర్తవ్వగానే మరోసారి సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement