మిస్టర్‌ మజ్ను!

Nidhi Agarwal to romance Akhil - Sakshi

ఆ కుర్రాడి కళ్లలోకి చూస్తే చాలు ఆ మాయలో పడి అల్లాడిపోతారట అమ్మాయిలు. అతను మాట్లాడుతుంటే చాలు ఏదో హాయి స్వరం విన్నట్లు మైమరచిపోతారట అమ్మాయిలు. జనరల్‌గా ఆ లక్షణాలన్నీ లవర్‌ బాయ్‌కే ఉంటాయి. ఆల్మోస్ట్‌ ఇలాంటి క్యారెక్టర్‌లోనే అక్కినేని అఖిల్‌ కనిపించనున్నారని టాక్‌. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధీ అగర్వాల్‌ కథానాయిక.

బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 1971లో అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రేమ్‌నగర్‌’లో చేసిన క్యారెక్టర్‌లోని కొన్ని షేడ్స్‌ అఖిల్‌ పాత్రలో కనిపిస్తాయని సమాచారం. ఆ సినిమాలోని ఏయన్నార్‌ పాత్రలో ఉండే లవ్‌ యాంగిల్‌ని మాత్రమే తీసుకున్నారట. ఈ సినిమా మేజర్‌ షెడ్యూల్‌ రీసెంట్‌గా లండన్‌లో పూర్తయింది. తాజా షెడ్యూల్‌ను హైదారాబాద్‌లో ప్లాన్‌ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి ‘మిస్టర్‌ మజ్ను’ టైటిల్‌ అనుకుంటున్నారట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top