వెన్నెల్లో.. ఇసుక తిన్నెల్లో.. | Nick To Celebrate Priyanka Chopra Birthday In A Beach | Sakshi
Sakshi News home page

వెన్నెల్లో.. ఇసుక తిన్నెల్లో..

Jul 15 2018 4:17 PM | Updated on Jul 15 2018 4:17 PM

Nick To Celebrate Priyanka Chopra Birthday In A Beach - Sakshi

ప్రియాంక, నిక్‌

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ స్టార్‌ నిక్‌ జోనాస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రియాంక, నిక్‌లు నోరు మెదపకపోయినా వరుస టూర్లు, పార్టీలతో ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ప్రియాంక పుట్టిన రోజు కోసం నిక్‌ భారీగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

ఈ నెల 18న ప్రియాంక తన 36వ ఏట అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ప్రియాంకకు ఇష్టమైన ఓ బీచ్‌లో సెలబ్రేషన్స్‌ చేయాలని నిక్‌ ప్లాన్‌ చేశారట. నిక్‌కు ముందుగా అనుకున్న కమిట్‌మెంట్స్‌ ఉండటం వల్ల అమెరికాను దాటి వెళ్లడానికి కుదరడం లేదని తెలిసింది. దాంతో వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో పుట్టిన రోజు వేడుక జరిపి ప్రియాంకపై తనకు ఉన్న ప్రేమను తెలిపేందుకు నిక్‌ సిద్ధమవుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement