పండగకి టైమ్‌ ఉంది | ngk movie released on after deepavali | Sakshi
Sakshi News home page

పండగకి టైమ్‌ ఉంది

Aug 31 2018 5:16 AM | Updated on Aug 31 2018 5:16 AM

ngk movie released on after deepavali - Sakshi

సూర్య

అభిమాన నటుడి సినిమా రిలీజ్‌ అంటే ఆ హీరో అభిమానులకు పండగే. కరెక్ట్‌గా పండగ సమయంలో రిలీజ్‌ ఫిక్స్‌ చేస్తే సంబరాలు డబుల్‌ అవుతాయి. కానీ ఈసారి సూర్య అభిమానులకు డబుల్‌ సంబరాలు మిస్‌. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఎన్‌జీకే’ దీపావళికి రావాలి. కానీ ఈ సినిమా దీపావళి తర్వాత రిలీజ్‌ అవుతుందని చిత్రబృందం తెలిపింది. సూర్య హీరోగా దర్శకుడు సెల్వ రాఘవన్‌ తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘ఎన్‌జీకే’(నంద గోపాల కుమారన్‌ అని అర్థం). యస్‌.ఆర్‌ ప్రభు, యస్‌. ఆర్‌ ప్రకాశ్‌బాబు నిర్మిస్తున్నారు.

సూర్య ఇందులో ఎమ్మెల్యేగా కనిపించనున్నారని సమాచారం. తొలుత ఈ సినిమాను దీపావళి స్పెషల్‌గా రిలీజ్‌ చేద్దాం అని ప్లాన్‌ చేసింది చిత్రబృందం. అయితే దర్శకుడు సెల్వ రాఘవన్‌ స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్‌ డిలే అయింది. దాంతో దీపావళికి రావడం లేదని అనౌన్స్‌ చేశారు. ‘‘మా ప్రొడక్షన్‌ హౌస్‌ చేస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎన్‌జీకే’. అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ ఇవ్వబోతున్నాం అనే నమ్మకం మాకుంది. ప్రాజెక్ట్‌ బాగా రావడానికి మా టీమ్‌ రేయి, పగలు కష్టపడుతున్నాం. కరెక్ట్‌ డేట్‌ త్వరలోనే అనౌన్స్‌ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సో.. సూర్య ఫ్యాన్స్‌ పండగ చేసుకోవడానికి ఇంకా టైమ్‌ ఉందన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement