కోడలు కాదు.. మామ

బిగ్ బాస్ 1, 2, 3... ఈ మూడు సీజన్లను వరుసగా ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్ చేశారు. ఈసారి వ్యాఖ్యాత స్థానంలో ఓ అందాల భామ ఉంటుందనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ అందాల భామ ఎవరో కాదు.. సమంత అని కూడా అంటున్నారు. అయితే నాలుగో సీజన్‌కి కోడలు సమంత కాదు.. ఆమె మామ నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారని తెలిసింది. నాగార్జున తనదైన శైలిలో నడిపించిన మూడో సీజన్‌కి మంచి స్పందన లభించడంవల్ల నిర్వాహకులు మళ్లీ ఆయన్నే కొనసాగించాలనుకున్నారట. నాగార్జున కూడా మళ్లీ హోస్ట్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. ఫస్ట్ సీజన్ ముంబైలో జరిగింది. రెండు, మూడు సీజన్లు హైదరాబాద్‌లో జరిగాయి. నాలుగో సీజన్ వేదిక కూడా హైదరాబాద్‌లోనే. వచ్చే నెల సెట్ వర్క్ మొదలు పెట్టనున్నారు. ఈ సీజన్‌లో పాల్గొనే ఇంటి సభ్యుల పేర్లు ఇంకా బయటికి రాలేదు. ఒక సభ్యుడిగా టీవీ ద్వారా పాపులర్ అయి, సినిమాల్లోనూ నటిస్తున్న బిత్తిరి సత్తి పేరు వినబడుతోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి