పండగ పోస్టర్లు

New Movie Posters Released For Sankranti 2020 - Sakshi

పండగ అనగానే సినిమా వాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందులోను సంక్రాంతి అనగానే ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వస్తుంది. కారణం వాళ్ల సినిమాలను విడుదల చేయటమే కాకుండా అనేక సినిమా ప్రమోషన్‌లను ఈ పండగకి ప్రారంభించటం ఆనవాయితీ. కొందరు తమ సినిమాల లుక్స్‌ను ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. రవితేజ, శ్రుతీహాసన్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మలినేని గోపిచంద్‌ దర్శకుడు. సాయి మాధవ్‌ బుర్రా మాటల రచయిత. ఎస్‌. ఎస్‌ తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘క్రాక్‌’ చిత్రం వేసవిలో విడుదల కానుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’.  మంగళవారం ఈ సినిమాలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఏమిగోస్‌ క్రియేషన్స్, సోనాల్‌ నారంగ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పి బ్యానర్‌పై నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2న ‘లవ్‌స్టోరీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన పాత్రలను పోషించి మంచి మార్కులు కొట్టేసే నటుడు సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను పండగ సందర్భంగా విడుదల చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ వెంకటేశ్‌ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కూడా వేసవి సందర్భంగానే విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top