క్రీస్తు సందేశం | new movie Jesus biography | Sakshi
Sakshi News home page

క్రీస్తు సందేశం

Mar 19 2017 11:37 PM | Updated on Sep 5 2017 6:31 AM

క్రీస్తు సందేశం

క్రీస్తు సందేశం

‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలొచ్చాయి.

‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలొచ్చాయి. మా ‘తొలి కిరణం’ గతంలో వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని దర్శకుడు జె. జాన్‌బాబు అన్నారు. పి.డి.రాజు, అభినయ, భానుచందర్, సాయికిరణ్‌ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’.

దర్శకుడు మాట్లాడుతూ– ‘‘సమాధి నుంచి బయటకు వచ్చిన క్రీస్తు 40 రోజుల పాటు ప్రజలకు ఎటువంటి సందేశం ఇచ్చారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఆర్‌.పి.పట్నాయక్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన రావడం హ్యాపీ. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా తెలుగుతో పాటు అన్ని భాషల్లో  ఏప్రిల్‌ 17న సినిమా విడుదల చేస్తాం’’న్నారు.

Advertisement
 
Advertisement
Advertisement